సంగారెడ్డిలో నందస్ ఫోటోగ్రఫీ స్టూడియో ప్రారంభించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన నందస్ ఫోటోగ్రఫీ వెడ్డింగ్, పోర్ట్రైట్, ఫిల్మ్ స్టూడియో ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్టూడియోను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు.

అనంతరం స్టూడియో నిర్వాహకులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లాడే మల్లేశం, నాయికోటి నవీన్, జలేందర్, నాయకులు బాలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు