ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల నాగుర్ల వెంకటేశ్వర్లు తీవ్ర దిగ్భ్రాంతి…

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి అది ప్రభుత్వ హత్యే నని,ప్రభుత్వ మొండి వైఖరి వల్లే కార్మికులు బలి అవుతున్నారన్నారు.శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలన్నారు.ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో బలవన్మరణాల వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి,ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలచి,వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలీ డిమాండ్ చేశారు.కార్మికులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని,”కార్మికుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం ఆపాలన్నారు.ఇప్పటికైనా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించి, మరిన్ని ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆర్టీసీ కార్మికుడు కుటుంబానికి రూ. 1 కోటి,కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు