నారాయణఖేడ్, ఏప్రిల్ 24:tg5 న్యూస్ ( జర్నలిస్ట్ షైక్ ఫయాజ్ )
కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని నారాయణఖేడ్ ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ కె. నెహ్రు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు
కొనసాగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా జీతాలను పెంచాలని, దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు సరైన భద్రత కల్పించే విధంగా పెన్షన్ మరియు సంక్షేమ పథకాలను బలోపేతం చేయాలని,
డ్రైవర్లు, కండక్టర్లపై పెరుగుతున్న పనిభారం తగ్గిస్తూ పని గంటలను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మిక స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.









