నేటి నుంచి స్టడీ సమ్మర్ క్యాంప్ ప్రారంభం

ఈ నెల 26న ఇబ్రహీమియా మసీద్‌లో ఇస్తెమ

నారాయణఖేడ్,
ఏప్రిల్ 24:tg5 న్యూస్ ( జర్నలిస్ట్ షైక్ ఫయాజ్ )
నారాయణఖేడ్ పట్టణంలో జమియతే అహెలే హాదీస్ ఆధ్వర్యంలో స్టడీ సమ్మర్ క్యాంప్ నేటి నుండి ప్రారంభంకానుందని సంస్థ బాధ్యులు మొహీత్, మంజర్ తెలిపారు.
వారు ఒక ప్రకటనలో పేర్కొంటూ.. పట్టణంలోని బిలాల్, ఇబ్రహీమియా, ఇలాహి, హష్మి, మోహమ్మదియా, జామే మసీద్‌లలో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం జమియతే అహెలే హాదీస్ అధ్యక్షుడు మొహమ్మద్ నయీమ్ (ఆసీఫ్) ఆధ్వర్యంలో జరుగుతోందన్నారు.
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ స్టడీ సమ్మర్ క్యాంప్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతే కాకుండా ఈ నెల 26వ తేదీన ఆదివారం ఇబ్రహీమియా మసీద్‌లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇస్తెమా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు