TG5, సంగారెడ్డి ప్రతినిధి
ఎంఆర్ఎఫ్ అంకనపల్లి పరిశ్రమలో యూనియన్ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో కార్మిక సంక్షేమం ఉద్యోగ భద్రత చారిత్రాత్మకమైన వేతన ఒప్పందం కోసం సిఐటియు సంఘం చుక్క గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని CITU రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు కార్మికులకు పిలుపునిచ్చారు.
రేపు ఎంఆర్ఎఫ్ అంకనపల్లి పరిశ్రమలో యూనియన్ గుర్తింపు వెరిఫికేషన్ ఎన్నికలు ఉన్నాయి ఈరోజు సిఐటి యూనియన్ యొక్క గేట్ మీటింగ్ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మిక హక్కుల కోసం సంక్షేమం కోసం పోరాడుతున్న ఏకైక సంఘం సిఐటియు అని అన్నారు ఈ పరిశ్రమలో మూడు అగ్రిమెంట్లు పూర్తి చేసిన కార్మిక సంఘాలు కార్మికులను మోసం చేశాయి అని అన్నారు. ఇప్పుడు సిఐటి కు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న రాంబాబు యాదవ్ మాటలు చెప్పడం తప్ప ఆచరణలో ఆయన వలన ఏమి కాదు అని అన్నారు. గతంలో మీ నాయకత్వంలో ఈ పరిశ్రమలు అగ్రిమెంట్ చేసి కార్మికులకు ఏమి ఉద్ధరించావో తెలుసు అన్నారు. కార్మికులకు మెరుగైన సౌకర్యాలు సాధించడంలో సిఐటి సంఘమే అగ్రగామిగా ఉందన్న విషయం ఆయనకు తెలుసు అన్నారు అబద్ధపు మాటలతో అసత్య ప్రచారతో కార్మికులకు మోసం చేయడం రాంబాబు యాదవ్ అలవాటు అని ఆయన అన్నారు. ఈ పరిశ్రమలో కార్మికులకు చారిత్రాత్మకమైన వేతన ఒప్పందం ఉద్యోగ భద్రత కేవలం సిఐటి సంఘం వలన సాధ్యమవుతుందని ఆయన అన్నారు. సిఐటియు సంఘం సమిష్టి నాయకత్వంతో ముందుకు పోతుంది అన్నారు. యజమాన్యం ఎన్నికలు జరగకుండా అనేక ప్రయత్నాలు చేసిన యాజమాన్యం ఆటలు సాగనివ్వలేదు అని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించే హక్కు కార్మిక సంఘాలకు ఉంది అన్నారు. కార్మిక సంఘాల ఎన్నికల్లో యజమాన్యం తలదూచడం దుర్మార్గమని అన్నారు రేపు జరిగే గుర్తింపు ఎన్నికల్లో చుక్క గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష అభ్యర్థి బీర మల్లేశం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు ఉపాధ్యక్షులు మాణిక్యం కోశాధికారి కె రాజయ్య సహాయ కార్యదర్శి యాదగిరి సదాశివపేట సిఐటియు నాయకులు లీల మల్లేశం శ్రీనివాస్ నర్సింలు కృష్ణమూర్తి ఎంఆర్ఎఫ్ అంకినపల్లి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు









