ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా ప్రకటించడంతో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ఐబీలో కృతజ్ఞత సభ శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ వనిత మాట్లాడుతూ.. వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి అధికారకంగా ప్రకటించడం హర్షనీయమని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసవి మహా సంస్థాన్ చైర్మన్ తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడానికి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 26వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అత్యధిక నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సభ జరుగుతుందని చెప్పారు. వాసవి జయంతిని అధికారికంగా ప్రకటించేందుకు కృషిచేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ కాల్వ సుజాతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బెజగం శ్రీనివాస్, కౌన్సిలర్ తోపాజి వీణ, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, కిరాణ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మిర్యాల పాండురంగం, ప్రధాన కార్యదర్శి అక్షంతల మదన్మోహన్, మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల సంతోష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మ్యాడం రాధా కిషన్, జూలకంటి బుచ్చిలింగం, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పుల్లూరి ప్రకాష్, వాసవి మహాసంస్థాన్ ప్రధాన కార్యదర్శి ఇల్లింతల రాజు, కోశాధికారి జూలకంటి మల్లేశం, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి నామ భాస్కర్, యువజన విభాగం అధ్యక్షుడు తోపాజి హరీష్, మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తోపాజీ తేజవతి, పట్టణ అధ్యక్షురాలు అక్షంతల కృష్ణవేణి పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు