నైపుణ్యాభివృద్ధితోనే భవిష్యత్ విజయం : అడిషనల్ కలెక్టర్ పాండు

TG 5,సంగారెడ్డి ప్రతినిధి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా, కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి జీవితంలో ముందుగా తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించు
కోవడం అత్యంత కీలకమని తెలిపారు. “మీరు ఏం కావాలను
కుంటున్నారు, ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుని, ఆ దిశగా క్రమశిక్షణతో పయనిస్తే విజయాన్ని అందుకోవడం సులభమవుతుందని సూచించారు.

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో కేవలం పాఠ్యపుస్తకాల జ్ఞానం సరిపోదని, నైపుణ్యాల అభివృద్ధి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నైపుణ్యాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వంటి అంశాలు విద్యార్థులను మరింత ముందుకు తీసుకెళ్తాయని చెప్పారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ తరహా శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని, తమ భవిష్యత్తుకు బాటలు విద్యార్థులను ప్రోత్సహించారు.

విజయం ఒక్కరోజులో సాధ్యంకాదని, నిరంతర శ్రమ, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. వైఫల్యాలను భయపడకుండా వాటిని పాఠాలుగా తీసుకుని మరింత ధైర్యంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
అలాగే, తమ సామాజిక నేపథ్యాన్ని అడ్డంకిగా కాకుండా, అవకాశంగా మలుచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, శిక్షణ కార్యక్రమాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవడమే విజయానికి మొదటి అడుగని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీడీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అకిలేష్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి రామాచారి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్,
RSET డైరెక్టర్ రాజేశ్ కుమార్, ట్రైనర్ అరవింద, స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనర్ కె. కృష్ణ కుమార్, మోటివేటర్ శ్రీ కూన వేణు, రాజు రాథోడ్ తదితరులు పాల్గొని విద్యార్థులకు నైపుణ్య శిక్షణపై అవగాహన కల్పించారు.

కార్యక్రమం లో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలోని డిగ్రీ విద్యార్థులు, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు