ఆర్టీసీ కార్మికులు సమ్మె దృష్ట్యా సంగారెడ్డి బస్ డిపో వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ..

• ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీలులేదు, ముందస్తు సమాచారం సేకరించాలి..
• అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.

TG5,సంగారెడ్డి ప్రతినిధి ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సంగారెడ్డి బస్ డిపో ను సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అక్కడి బందోబస్తు, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డిపోలో ఉన్న ఆర్టీసీ అధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. బస్సులు, ప్రభుత్వ ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమ్మె శాంతియుతంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మరియు రవాణా వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే డిపో పరిసరాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టానికి లోబడి నడుచుకోవాలని అన్నారు. ప్రజలు, కార్మికులు పరస్పర సహకారంతో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ బస్సులు నడపడానికి అర్హత కలిగిన డ్రైవర్లు ముందుకు రావాలని సూచించారు. ఆసక్తి ఉన్న డ్రైవర్లు జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా, ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి విధుల్లో చేరినా, వారికి ఎటువంటి బెదిరింపులు లేకుండా పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ విజిటింగ్ లో ఆర్ టి సి డిపో మేనేజర్ ఉపేందర్, డిఎస్పీ సత్తయ్య గౌడ్, సంగారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ రాము నాయుడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణరెడ్డి, కొండాపూర్ సిఐ కుమన్ కుమార్ తదితరులు ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు