హనుమకొండ:
బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు.
గురువారం హనుమకొండలోని తన నివాసంలో గీసుగొండ ఉమ్మడి మండల బిఆర్ఎస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల వారీగా పార్టీ పరిస్థితులను సమీక్షిస్తూ, భవిష్యత్ కార్యాచరణపై నాయకులతో చర్చించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. రైతులకు రుణమాఫీ, యువతకు ఉద్యోగాల కల్పన, మహిళలకు భరోసా వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మందగించాయని, సంక్షేమ పథకాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను,మోసాలను గ్రామస్థాయిలో ప్రజలకు తెలియజేసి, బిఆర్ఎస్ పార్టీకి మద్దతు పెంచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోగుల సంజీవ కంది శ్రీనివాస్ దామోదర్ 16 డివిజన్ 17 డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు పాల్గొన్నారు









