వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ని మర్యాద పూర్వకంగా కలిసిన నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు

హనుమకొండ

తేది: 23-04-2026

హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ని బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు చకిలం ఉపేందర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమస్యలు, కోర్టు సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు న్యాయసేవలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం వంటి అంశాలపై చర్చించారు.

బార్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హామీ ఇచ్చారు. న్యాయవాదుల సంక్షేమం, కోర్టుల మౌలిక వసతుల పెంపు కోసం తన వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చకిలం ఉపేందర్‌తో పాటు సభ్యులను ఎంపీ అభినందించారు. వారు న్యాయవాదుల హక్కుల పరిరక్షణలో, ప్రజలకు మెరుగైన న్యాయసేవలు అందించడంలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు లలిత కుమారి, సాంబశివరాజు తదితర కీలక సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు