TG 5, సంగారెడ్డి ప్రతినిధి
- పాఠశాల ప్రగతి,విజయాల ప్రదర్శన
- ప్రగతి పత్రాలు అందజేత.
- ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్ బహుకరణ.
- వేసవిలో పిల్లల పట్ల తీసుకోవాలసిన జాగ్రత్తలు.
- పర్యావరణ పరిరక్షణ లో భాగంగా పేపర్ సంచుల ప్రదర్శన.
2025-26 విద్యా సంవత్సరం చివరి పనిదినం సందర్బంగా గురువారం నిజాంపూర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మీనా అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో తల్లిదండ్రులనుద్దేశించి ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరములో పాఠశాల సాధించిన అభివృద్ధి అభివృద్ధి,ప్రత్యేక గుర్తింపులు మరియు విజయాలైన
- తెలంగాణ రాష్ట్ర స్థాయి గ్రీన్ ఛాంపియన్ అవార్డు.2025
- ఎస్.సి.ఈ.ఆర్.టి విడుదల చేసిన ట్రైల్ బ్లేజర్ 2025 పుస్తకంలో చోటు.
- రాష్ట్ర స్థాయి బెస్ట్ ప్రాక్టీస్ కు ఎంపిక
- ఎన్.ఎస్.పి.సి 2025 లో జిల్లా ప్రథమ స్థానం – ఇన్స్పైర్డ్ టీచర్ గా గుర్తింపు.
- ఎస్.హెచ్.ఆర్.టి రేటింగ్ – 88.5% (4 స్టార్)
- జిల్లా స్థాయి వేస్ట్ టు వెల్త్ పోటీలలో బహుమతి
- ఎస్.సి.ఈ.ఆర్.టి 2026 పప్పెట్రీ పోటీలలో జిల్లా ప్రాతినిధ్యం.
- జిల్లా & మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.
- విద్యాశాఖ డైరెక్టర్ డా.నవీన్ నీకోలస్ నుండి ప్రశంసా పత్రం.
- మొదలగు వాటిని వివరించారు.అంతేకాక
వేసవి సెలవుల నేపధ్యంలో పిల్లలను ఉదయం,సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు పంపాలని, మధ్యాహ్న సమయంలో ఇంటిలోనే ఉండే విధంగా చూడాలని, చెరువులు, కాలవులు,నదుల దగ్గరకు పిల్లలు వెళ్లకుండా చూడాలని అన్నారు.
వేసవి సెలవుల్లో పిల్లలతో కలసి పేపర్ చదవడం,టి.వి చూడటం,వారు చేసే చిన్న,చిన్న పనులను అభినందించడం, వారికి ఆత్మ విశ్వాసం పెంపొందేలా వ్యవహరించాలని అన్నారు.
అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ,ఉపాధ్యాయులు నవనీత,సునీత లు విద్యార్థులకు అభివృద్ధి పత్రాలు( ప్రోగ్రెస్ కార్డ్స్ ) ఇచ్చారు.ప్రతిభ చూపిన విద్యార్థులకు పతకాలు బహుకరించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులందరూ ప్లాస్టిక్ సంచులు బదులు పేపర్ సంచులు వాడాలని సూచిస్తూ విద్యార్థులు పేపర్ సంచులను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మీనా, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు నవనీత,సునీత, అంగన్వాడి టీచర్ సువర్ణ, శోభ,తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు….









