- మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
- టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
TG 5, సంగారెడ్డి ప్రతినిధి
కొండాపూర్ మండలం తేర్పోల్, ఎదురుగుడెం గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలకు భూమి పూజ చేసిన నిర్మలా జగ్గారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే లక్ష్యంగా పని చేస్తుందని టీజీ ఐఐసీ చైర్పర్సన్ నిర్మలరెడ్డి తెలిపారు. బుదవారం మండల పరిదిలోని తేర్పోల్, ఎదురుగూడెం గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ రూ 10 లక్షల తో నిర్మంచే మహిళా సమాఖ్య భవనాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా నిర్మల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల పక్షపాతి అని, మహిళల కోసం ప్రత్యేకంగా సఃఓఏమ, అభివృద్ది పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రతి మహŸళను కోటీశ్వరురాలిని చేసేందుకు డ్వాక్రా సంఘాల ద్వారా పావల వడ్డీకే రుణాలను అందించడం జరిగిందన్నారు. రాష్ట్రవలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. ఇవే కాకుండా మహిళా సంఘాల సభ్యులకు ఇందరిమ్మ చీరలు, మహిళల పేరుపైన నూతన రేషన్ కార్డులు, ప్రస్తుతం ఇళ్ళు లేని వారికి మహిళల పేరుమీదనే ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకునేందుకు ప్రభుత్వం విడతల వారీగా రూ 5 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. గత పాలకుల మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదన్నారు. గత 10 సంవత్సరాల గ్రామంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సర్పంచ్ సతీష్, కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశం గౌడ్. నర్సింలు, ప్రభుదాసు, అశోక్, గోపాల్ తో పాటు పంచాయతీ సభ్యులు, ఐకెపి వీఓలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.









