- ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు
- ప్రభుత్వానికి చెంపపెట్టు
- BRS party రాష్ట్ర నాయకులు
- పైతర సాయికుమార్
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పై హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని
BRS పార్టీ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్ అన్నారు
ఈ తీర్పుతోనైనా కాంగ్రెస్ కక్షపూరిత, దురుద్దేశపూరిత విధానాలను మార్చుకొని బుద్ది తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ హరీష్ రావు ప్రతిష్టను దెబ్బతీయాలన్న దురుద్దేశంతో రెండు జాతీయ పార్టీలు తెలంగాణ జీవధార కాళేశ్వరం కేంద్రంగా కుట్రలు, కుతంత్రాలు పన్నాయి.
సాంకేతికంగా తలెత్తిన సమస్యను మరమ్మత్తులు చేసి పరిష్కారం చేయకుండా
రెండున్నరేళ్లుగా వికృత రాజకీయక్రీడకు పూనుకున్నది.
సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగిందని, ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడం
చారిత్రాత్మకం
తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పై జరుగుతున్న కుట్రలను రాజకీయాలకు అతీతంగా తిప్పికొట్టాలని పౌర సమాజానికి
నేటి యువతరానికి
విజ్ఞప్తి.









