కలం నిఘా: న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:ఏప్రిల్ 22
విద్యార్థులంతా సమ్మర్ హాలిడేస్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. అకడమిక్ కేలండర్ ప్రకారం… ఈ నెల 24 నుంచి వేసవి సెలవుల ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది,
ఈ సంవత్సరం మార్చి నెల మొదటి వారం నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ముందుగానే ఈ వేసవి సెలవులను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్న ట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో విద్యార్థులకు ఏకంగా 48 రోజులపాటు సెలవులు లభించనున్నా యి.
జూన్ 12 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతా యి. అంటే జూన్ 12 నుంచి 2026-2027 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. వేసవి సెలవులు ప్రకటించడంతో పిల్లల చదువుల కోసం పట్టణాల్లో ఉంటున్న వారు.. సొంతూరి ప్రయా ణానికి రెడీ అవుతున్నారు. ఎండల నేపథ్యంలో ముందుగానే సెలవులు ప్రకటించడం పట్ల విద్యా ర్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యా సంవత్సరం చివరి రోజులోపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించా లని, విద్యాశాఖ సూచిం చింది, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయట తిరగకూడదని విద్యార్థులకు వివరించా లని తెలిపింది,
వేసవి సెలవుల్లో పిల్లలు సము ద్రం, నదులు, చెరువులు, సరస్సులు, కుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు పిల్లలపై నిరంతర పర్య వేక్షణ ఉండేలా చూడాలని పేర్కొంది.









