లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు

కరీంనగర్

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ప్రైవేటు డ్రైవర్లను రంగంలోకి దించారు. కరీంనగర్-2 డిపోకు చెందిన బస్సులో ప్రయాణికులను ఎక్కించి ఓ ప్రైవేటు డ్రైవర్ సహాయంతో వరంగల్కు పంపారు. అల్గూనూర్ వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికితరలించి చికిత్స అందిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు