చైతన్యపురి డివిజన్ వికాస్ నగర్ కాలనీలో ఉన్న మీ సేవ భవనాన్ని పోలీస్ స్టేషన్ కోసం, న్యూ దిల్‌సుఖ్‌నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్‌ను మీసేవా కార్యాలయం కోసం ఉపయోగించేందుకు జీ.హెచ్.ఎం.సీ. , పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నారని కాలనీవాసులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కి మొరపెట్టుకున్నారు.దీనిపై స్పందించిన సుధీర్ రెడ్డి కాలనీకి చేరుకుని డీసీ బోనగిరి శ్రీనివాస్ ని పిలిపించి,దిల్‌సుఖ్‌నగర్ కమ్యూనిటీ హాల్‌ను మీసేవ కార్యాలయానికి ఇవ్వబోమని స్పష్టం చేశారు.కాలనీవాసులకు అండగా తాను నిలబడతానని హామీ ఇచ్చి జోనల్ కమిషనర్‌తో మాట్లాడారు.అనంతరం మీసేవ,వార్డ్ ఆఫీస్ వద్దకు వెళ్లి తాళం వేయడం జరిగింది.మీసేవ కమిషనర్ రవికిరణ్‌తో కూడా మాట్లాడి కాలనీవాసులకు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ మాజీ కార్పొరేటర్ విట్టల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, న్యూ దిల్‌సుఖ్‌నగర్ కాలనీవాసులు సుష్మిత, రోజా పద్మిని, భవాని నగర్ కాలనీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, వికాస్ నగర్ కాలనీ అధ్యక్షులు వెంకటేష్, శోభారాణి, పవన్ సంతోష్, తులసి కృష్ణ,గట్టు శ్రీను, రమణారెడ్డి, జలంధర్, కిరణ్, నరేష్, శ్రీధర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









