ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ‘సే నో టు డ్రగ్స్’ నినాదంతో హనుమకొండలో శనివారం భారీ అవగాహన ర్యాలీ హోరెత్తింది. అదాలత్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఉత్సాహంగా సాగిన ఈ ప్రదర్శనను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. యువత మత్తు మహమ్మారికి పూర్తిగా దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చిన ఉన్నతాధికారులు, అక్కడికక్కడే భారీ మానవహారం ఏర్పాటుచేసి డ్రగ్స్ నిర్మూలనపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ధార కవిత, అదనపు డీసీపీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీడబ్ల్యూఓ విశ్వజతో పాటు పోలీసు, ఎక్సైజ్ సిబ్బంది, ఆశా వర్కర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఈగల్ టీం సభ్యులు విశేషంగా పాల్గొని మత్తు రహిత సమాజ సాధనకు ముక్తకంఠంతో గొంతుకలిపారు.









