హజ్ యాత్రకు వెళ్తున్న సీనియర్ జర్నలిస్ట్‌కు సన్మానం..

నారాయణఖేడ్, మే 2:( tg5న్యూస్ )( జర్నలిస్ట్ షైక్ ఫయాజ్ )
నారాయణఖేడ్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ సత్తార్ ఈ నెల 5వ తేదీన హజ్ యాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా, ఆయనకు తోటి జర్నలిస్ట్ మిత్రులు శనివారం పట్టణంలోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో పూలమాల శాలువలతో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన యాత్ర విజయవంతంగా పూర్తవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మానిక్ ప్రభు, అమృత్, కౌసర్, వెంకటేశం, హసీబ్ పటేల్, విట్ఠల్, మధుసూదన్, గోవర్ధన్, ఆసీఫ్, మజర్, వాజీద్, సయీద్, ప్రతాప్, చోటు, రాములు, ఇబ్రహీం, రషీద్, లతీఫ్, ఖైసర్. షైక్ ఫయాజ్ పాల్గొన్నారు. అలాగే స్థానికులు బాబు ఖాన్, రజాక్, రషీద్, బాబా, ఖదీర్ తదితరులు హాజరయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు