TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అయిన మునిపల్లి సత్యనారాయణ, ఎగమామిడి అనంతమ్మ, మహమ్మద్ రహమత్, సీమా సుల్తానలను 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో నిబద్ధతతో పని చేసి మున్సిపాలిటి అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుందని తెలిపారు.
కోఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి సహకరిస్తున్న నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని హామీ ఇచ్చారు. ఇట్టి సందర్భంగా పులిమామామిడి మమత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి ఎప్పటికైనా ఉన్నత పదవులు లభిస్తాయని దీనిని దృష్టిలో ఉంచుకొని నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడాలని అన్నారు. ఇక ముందు కూడా అందరికి పదవులు లభిస్తాయని నిర్మల మేడం చెప్పినట్లు ఎవ్వరు కూడా నారాజు కాకుండా పనిచేయాలని అన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిజిఐఐసి చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని ఎన్నికైన సభ్యులందరికి పూలమాలలు వేసి, శాలువాలు కప్పి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమం మున్సిపల్ కమీషనర్ టి.శివాజీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, వార్డు కౌన్సిలర్లు పాతదొడ్డి అనిత, లక్ష్మి ప్రియ, గోపి ప్రియాంక, రోజా గౌడ్, లావణ్య, వాజీద్, కుతేజఫాతిమ, గౌసియా బేగం, బేగరి అరుణ్, ఎరుకల నర్సింలు, శజ్జి భాయ్, మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









