బుద్ధ పౌర్ణమి సందర్భంగా అఖండ ధ్యానం…

TG 5, సంగారెడ్డి ప్రతినిధి మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన్ శెట్టిపల్లి గ్రామంలో పంచాక్షరి మహా శక్తి పిరమిడ్ కేంద్రంలో ఈరోజు ఉదయం 6 గంటల నుండి 24 గంటల పాటు అక్కడ ధ్యానం నిర్వహిస్తున్నారు బుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం పంచాక్షరి పిరమిడ్ మాస్టర్ అనసూయమ్మ మాట్లాడుతూ సర్వ మానవులలో ఒకే ఆత్మ ఉందని గౌతమ్ బుద్ధుడు చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు బ్రహ్మశ్రీ పితామగురువు పత్రీజీ ఆశయ సాధనలో భాగంగా ఈరోజు శ్వాస మీద ధ్యాస పెడితే ప్రతి ఒక్కరికి జీవిత సత్యాలు అర్థమవుతాయని ఆమె తెలియజేశారు బుద్ధం శరణం గచ్చామి అంటూ అందరికీ బుద్ధుని గురించి వివరించారు
*గౌతమ బుద్ధుని అమృత వాక్కులు*

*విజయం మీ సొంతం కావాలంటే..*

జీవితంలో విజయం సాధించడం అంటే వేల యుద్ధాలు గెలవడం కాదు, తనను తాను జయించడం. తన మనస్సును, ఆలోచనలను నియంత్రించుకోగలిగిన వ్యక్తికి లభించే విజయాన్ని ఎవరూ లాక్కోలేరు. అలాగే ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కంటే ఆ లక్ష్యం వైపు మనం సాగించే ప్రయాణం ఎంత పవిత్రంగా ఉందనేది ముఖ్యం.

*అహింస, యజ్ఞాలు*

ప్రాచీన కాలంలో కోరికలు, ఆకలి, వృద్ధాప్యం మాత్రమే మానవుడికి కష్టాలుగా ఉండేవని, కానీ పశుపక్ష్యదుల… హింస పెరిగే కొద్దీ వ్యాధులు, కష్టాలు అసంఖ్యాకమయ్యాయని, బుద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు, యజ్ఞాల పేరుతో అమాయక జంతువులను బలి ఇవ్వడం అధర్మమని, ఇది నిందనీయమైన చర్య అని ఆయన ఖండించారు. జంతు బలి ద్వారా ధర్మం నశిస్తుందని, అహింస ద్వారానే అసలైన ధర్మం నిలబడుతుందని అనసూయమ్మ బుద్ధుని గురించి అర్థమయ్యే విధంగా బోధించారు. ఈ కార్యక్రమంలో సురేందర్ పట్లోళ్ల రామకృష్ణ నాగరాజు సంగాయిపేట్ వీరేశం ఆలూరి అనిత జోగిపేట చెందిన సత్యమ్మ పొడిచిన పల్లి సంతోష లక్ష్మి చౌటకు పిరమిడ్ మాస్టర్ అనసూయ పుష్ప తదితరులు అఖండ ధ్యానంలో పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు