ఆకతాయిల ఆగడాలకు చెక్.. సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాల సైలెన్సర్లు సీజ్

TG5, సంగారెడ్డి ప్రతినిధి
• సైలెన్సర్లు మార్పు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు..
• ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్‌లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ – పటాన్‌చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్

: బైక్ సైలెన్సర్లు మాడిఫై చేసి పెద్ద శబ్దాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మరియు సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్ గారి ఆదేశానుసారం ఈ రోజు పటాన్ చెర్వు పట్టణంలో పటాన్‌చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్, ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తూ శబ్ద కాలుష్యం కలుగజేస్తున్న 07- వాహనదారులను గుర్తించి, మోటర్ వెహికిల్ చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అలాగే అట్టి వాహనాలకు అమర్చిన మాడిఫైడ్ సైలెన్సర్లను తొలగించడం జరిగింది.

వాహనదారులు ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగిస్తూ పట్టణ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా శబ్ద కాలుష్యం సృష్టిస్తే సహించబోమని, అట్టి వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పటాన్‌చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు