TG 5, సంగారెడ్డి ప్రతినిధి
, సంగారెడ్డి ఆద్వర్యంలో మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మహిళా మరియు బాలల రక్షణపై అవగాహన కార్యక్రమాలు..
సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈ రోజు (01.05.2026) అంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో కాశీపూర్, కలివేముల, కొత్లాపూర్ గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏహెచ్‌టీయూ ఎస్ఐలు యం.డి. లాల్ అహ్మద్, మాణిక్ రెడ్డి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, కార్మికుల దోపిడీ, లైంగిక దోపిడీ, ఈవ్ టీజింగ్, అవయవాల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక దాడులు, సైబర్ స్టాకింగ్, సైబర్ బులీయింగ్, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ ఎమర్జెన్సీ నంబర్లు 100, 112, మహిళల హెల్ప్‌లైన్ 1091 / 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 వంటి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏహెచ్‌టీయూ సిబ్బంది మరియు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.









