ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి భరోసా సెంటర్ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ, బాలల రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

TG 5,సంగారెడ్డి ప్రతినిధి: “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు తేది: 01.05.2026 నాడు సంగారెడ్డి భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ఐ బి చౌరస్తా, నర్సింగ్ కాలేజ్ ఆందోల్, జోగిపేట బస్ స్టాండ్ లో బాలల సంక్షేమం మరియు యువత అభివృద్ధి కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ మాట్లాడుతూ లింగ సమానత్వం పాటిస్తూ ఆడ, మగ తేడా లేకుండా సమానంగా చూడాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల కలిగే సమస్యలను వివరించారు. అలాగే పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ, ఇటువంటి కేసులను తీవ్రంగా పరిగణించి నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మౌనం వీడి నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తేనే బాధితులకు న్యాయం జరిగి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో ఉపయోగపడే డయల్ 100, మహిళా హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్లతో పాటు జిల్లా భరోసా సెంటర్ నెంబర్ 8712656773 ను తమ ఫోన్లలో సేవ్ చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమాలలో నర్సింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ యాదమ్మ, కార్మిక సంఘాల నాయకులు, భరోసా సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు