TG5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట మండలంలోని నిజాంపూర్ గ్రామంలో నిజాంపూర్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోవూరు సంగమేశ్వర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత మీకు నచ్చిన రంగాలలో నైపుణ్యత చూపెట్టాలని, గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. మూడు రోజులపాటు కొనసాగనున్న ప్రీమియర్ లీగ్ లో 10 టీం లు పాల్గొంటున్నాయి.
ఈ కార్యక్రమంలో నిజాంపూర్ గ్రామ సర్పంచ్ తులసి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నర్సింలు, నిజాంపూర్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు బిజెపి సీనియర్ నాయకుడు సారా కృష్ణ, శ్రీకాంత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 11









