రాజరాజేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

TG 5, సంగారెడ్డి ప్రతినిధి
కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో శ్రీ పార్వతి మరకత రాజరాజేశ్వర స్వామి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి, గ్రామ ప్రజల సంక్షేమం కోసం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ, ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సన్మానించారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, మాజీ గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ పవన్, దేవేందర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు