నారాయణఖేడ్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మెబాట

 

  • నేడు బస్సులు బంద్ – ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు
  • ఆర్టీసీ డిపోలో ఎక్కడికి అక్కడే నిలిచిపోయిన బస్సులు

ఖేడ్ ఏప్రిల్ 22( tg5 న్యూస్ )( జర్నలిస్ట్ షైక్ ఫయాజ్ )
నారాయణఖేడ్ నియోజకవర్గం అన్ని మండలాలకు ప్రధానంగా సంగారెడ్డి, జోగిపేట్ హైదరాబాద్ రూట్ వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో నిన్న(మంగళవారం) జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు కార్మికులు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాల్సిందే అంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్ మోగించింది. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో ఆర్టీసీ డిపోలో బస్సులను పూర్తిగా నిలిపివేశారు. కార్మికులు సమస్యలను ముగించి డిపోలో తెల్లవారుజామునుండే బంద్ పాటించారు. ముందస్తు చర్యగా పోలీసులు డిపోలో మోహరించారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు నారాయణఖేడ్ బస్టాండ్ లో ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కాగా, ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన 32 హామీలను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు