- పత్రికా ప్రకటన తేది:21-04-26
- పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయి
- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
పోలీస్ అధికారులకు పదోన్నతులతో పాటు బాధ్యతలుకూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. వరంగల్, జనగామ ఏ.ఎస్పీగాలు పనిచేస్తూ పరిపాలన విభాగం అదనపు ఎస్పీలుగా పదోన్నతులపై బదిలీపై వెళ్తున్న ఏ.ఎస్పీలు, శుభం ప్రకాష్, చేతన్ నితిన్‌లను మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసారు. అనంతరం వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన డిసిపిలు, ఎసిపిలు, ఇతర పోలీస్ అధికారులు బదిలీపై వెళ్తున్న ఇరువురు ఏ.ఎస్పీలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పదోన్నతిపై బదిలీపై వెళ్తున్న ఇరువురు అధికారులకు అభినందనలు తెలియజేస్తూ ఇరువురు అధికారులు అప్పగించిన పనులు సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, నేరాల నియంత్రణలో వారి ప్రత్యేకత చాటుకున్నారని, అదే విధంగా శాంతి భద్రత విషయంలో ఇరువురు అధికారులు సంబందిత అధికారుల సమన్వయంతో పనిచేస్తు చక్కటి ఫలితాలను రాబట్టగలిగారని, అదే విధంగా వీరు తీసుకున్న నిర్ణయాలతో ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు, ప్రజల అభిమానాన్ని సంపాదించారని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
ఈ కార్యక్రమములో డిసిపిలు అంకిత్‌కుమార్, రాజమహేంద్రనాయక్, ధార కవిత, ట్రైనీ ఐపిఎస్ మనీషా నేహ్ర, అదనపు డిసిపిలు రవి, సురేష్‌కుమార్, శ్రీనివాస్‌తో పాటు, సంబంధిత డివిజన్లకు చెందిన ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, సబ్`ఇన్స్‌స్పెక్టర్లు పాల్గోన్నారు.









