ఈ నెల 26 న వాసవి మాత జయంతి ఉత్సవాలు.

వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26 న వాసవి మాత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వాసవి మాత సేవా సమితి అధ్యక్షులు గుండా రామ కోటేశ్వర రావు తెలిపారు. మంగళవారం చైతన్యపురిలో వి త్రీ ఛానల్, విశ్వంభర దినపత్రిక చైర్మన్ కాచం సత్యనారాయణకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రామకోటేశ్వరరావు మాట్లాడుతూ కొత్తపేట మోహన్ నగర్ కమర్షియల్ టాక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో ఉత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా సహస్రనామ కుంకుమార్చన జరుపుటకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కుంకుమార్చన పాల్గొనేవారు ఆదివారము ఉదయం 10 గంటలకు హాజరుకావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రచ్చ శేఖర్, రాజు గుప్త తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు