ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు విజయవంతం కావడంలో సాంస్కృతిక సారధి కళాబృందం పాత్ర కీలకం.
• జిల్లా ప్రజలు, ముఖ్యంగా యువతను అప్రమత్తం చేయడంలో జిల్లా పోలీసు శాఖతో కలిసి పనిచేయాలి.
• సంగారెడ్డి జిల్లా సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులను అభినందించి, సత్కరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.
TG5:సంగారెడ్డి ప్రతినిధి: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా (ఏప్రిల్ 13-18) వారం రోజుల పాటు నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు విజయవంతం కావడంలో సంగారెడ్డి జిల్లా సాంస్కృతిక సారధి కళాబృందం కీలక పాత్ర పోషించిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. వారి సేవలను గుర్తిస్తూ, అభినందిస్తూ ప్రశంసాపత్రాలు, మెమెంటోలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆన్లైన్ మోసాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై ప్రజలను చైతన్యం చేయడంలో సాంస్కృతిక సారధి కళాబృందం చేస్తున్న కృషి అభినందనీయమని, ఇదే విధంగా జిల్లా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, వారి భవిష్యత్తుపై దృష్టి సారించేలా మరిన్ని స్కిట్లు, పాటల ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు సునిల్ కుమార్, రమేష్, ఎ.కే. బిక్షపతి, రవీందర్, సంధ్య, స్వప్న, శశిప్రియ, మల్లేష్, సాయిలు, దుర్గేష్, వినేశ్, ఆగమయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.









