హట్టహాసంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జన్మదిన వేడుకలు….

TG5, సంగారెడ్డి ప్రతినిధి

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా, హట్టహాసంగా నిర్వహించబడ్డాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం వద్ద పండుగ వాతావరణాన్ని తలపించింది. పట్టణం అంతటా ఎమ్మెల్యే ఫ్లెక్సీలు, బ్యానర్లు అలంకరించగా, కార్యకర్తలు, అభిమానుల సందడి నెలకొంది. మండలాల వారీగా వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రేన్లతో గజమాలలు వేసి, శాలువాలతో సత్కరించి ఎమ్మెల్యే కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బిఆర్ఎస్ శ్రేణుల మధ్య భారీ కేక్ కట్ చేసి వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణం 13వ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సేవా భావాన్ని చాటుకున్నారు.
ప్రత్యక్షంగా మరియు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు