ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నాగవెళ్ళి నరేందర్–సరిత దంపతుల 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నాగవెళ్ళి సాయి సిద్దాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం సుమన్ టీవీ మెసేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ బాబు,బెస్ట్ వాయిస్ పత్రిక చీఫ్ ఎడిటర్ మోహన్, అంతర్జాతీయ మెజీషియన్ కళ్యాణ్,TG5 ఉమ్మడి వరంగల్ బ్యూరో చీఫ్ అమరేంద్ర చారి, ప్రగతి హై స్కూల్ కరస్పాండెంట్ చందర్,గాయకులు కరుణాకర్, ముత్తోజు రాజు,పూర్ణచందర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.అలాగే ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ సభ్యులు వెంకట్, వెంకటేష్, రంజిత, బిక్షపతి, సాగర్, రమేష్,అజయ్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తూ నాగవెళ్ళి నరేందర్ సేవలను అతిథులు కొనియాడారు.
అనంతరం నాగవెళ్ళి నరేందర్–సరిత దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానం చేశారు.









