బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ శర్మ…

తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ శర్మ బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కే. చంద్రశేఖర్ రావు వెంట నడుస్తూ 26 సంవత్సరాలుగా బీఆర్‌ఎస్‌లో కొనసాగినట్లు తెలిపారు.
పార్టీ ప్రారంభం నుంచే క్రియాశీలకంగా పనిచేసి, ఉద్యమకాలంలో ముందువరుసలో నిలబడి తనపై 33 కేసులు నమోదయ్యాయని చెప్పారు. అయినప్పటికీ తనకు పార్టీలో తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, కనీసం కేసీఆర్‌ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు. చివరకు విసిగి, బాధతో తనతో పాటు తన భార్య కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు