ప్రచురణార్థం
సమస్త రైతు సోదరులకు, అడ్తిదారులకు, ఖరీదుదారులకు మరియు హమాలి గుమస్తా కార్మిక సోదరులకు తెలియజేయునది ఏమనగా, ప్రస్తుతము ఎండల తీవ్రత అధికముగా ఉన్నందున సరుకుల వేలం పాట సమయములు దివి:23-04-2026 గురువారము నుండి ఈ క్రింది విధంగా మార్చడమైనది.
- మిర్చి బీటు : ఉదయం గం”7-05 ని.లకు
- పత్తి బీటు : ఉదయం గం”8-05 ని.లకు
- పల్లికాయ బీటు : ఉదయం గం”8-15 ని.లకు
- పసుపు బీటు : ఉదయం గం”8-30 ని.లకు
- అపరాలు, ధాన్యం బీటు : ఉదయం గం”8-45 ని.లకు.
మరియు ఈ వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరంగల్ గ్రేన్ మార్కెట్ గుమస్తా సంఘం వారి కోరిక మేరకు *దివి:22-04-2026 నుండి వచ్చే ప్రతి బుధవారం* మార్కెట్ యార్డ్ కు సెలవు ప్రకటించనైనది
కావున రైతు సోదరులు ఇట్టి విషయాన్ని గమనించి తమ సరుకులను బందు రోజులో తెచ్చి ఇబ్బంది కావద్దని కోరనైనది.
ఇట్లు
వ్యవసాయ మార్కెట్ కమిటీ
వరంగల్
Post Views: 14









