మృతి చెందిన బాల కార్మికుడు ప్రీత్ నాయక్ ..
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ బూడిదలో పోసిన పన్నీరయింది, విద్యాబుద్ధులు నేర్చుకొని రేపటి దేశ పౌరులుగా నిలవాల్సిన బాలలేందరో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల బాల కార్మికులగా మారి కాటికి కాళ్లు చాపుతున్నారు, ఉత్తరాది రాష్ట్రాల నుండి బాల కార్మికులను తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వారి చేత ప్రమాదకరమైన లేబర్ పనులు చేయిస్తున్నారు కొందరు కాంట్రాక్టర్లు, దీంట్లో భాగంగానే ఆదినారాయణ అనే సివిల్ కాంట్రాక్టర్ మరియు కిషోర్ గృహ నిర్మాణాల బిల్డర్ వీరిద్దరు కలిసి ఒరిస్సా రాష్ట్రం నుండి కొంతమంది బాల కార్మికులను తీసుకొచ్చి మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఘాట్కేసర్ టౌన్ బ్రూక్ బాండ్ వెంచర్లో నిర్మాణ పనులు, సెంట్రింగ్ పనులు చేయిస్తున్నారు, కాగా సెంట్రింగ్ పనులు చేస్తుండగా 16 సంవత్సరాల ప్రీతు నాయక్ అనే బాల కార్మికుడు విద్యుత్ షాక్ కొట్టి తీవ్ర గాయాలపాలయ్యాడు, గమనించిన తోటి కార్మికులు చికిత్స నిమిత్తం బాధిత బాల కార్మికుడిని ఘాట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు, ఈ మేరకు పోలీసులు కాంట్రాక్టర్ ఆదినారాయణ మరియు బిల్డర్ కిషోర్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .. కానీ పోలీసులు నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతార లేక నామ మాత్రంగా కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారా అనేది అంతుచిక్కని ప్రశ్న .. ఏది ఏమైనప్పటికీ బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ..









