11వ వార్డులో కౌన్సిలర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికా సభ నిర్వహణ

T G5, సంగారెడ్డి ప్రతినిధి

11వ వార్డులో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ కౌన్సిలర్ వైద్యం గోపి, ప్రియాంక, పవన్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికా సభ నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఛైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ, సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవిలు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను, అవసరాలను వెల్లడించారు.
సభలో ప్రధానంగా తాగునీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, కాలువల శుభ్రత, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. ప్రజల నుండి వచ్చిన 6 గ్యారంటీ లకు సంబందించిన 135 అప్లికేషన్స్ ను ప్రజల నుండి స్వీకరించాము. ఇట్టి దరఖాస్తులను అధికారులదృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 11వ వార్డు కౌన్సిలర్ గోపి ప్రియాంక మాట్లాడుతూ ణా పై నమ్మకం ఉంచి గెలిపించి నదుకు వార్డు ప్రజలకు కావలసిన పనులను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు సభ్యులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో 11వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు