TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట పట్టణంలోని స్థానిక వీరశైవ సమాజం ,చౌకీ మఠం, జగద్గురు పంచాచార్య బసవ సేవా సదన్ లో మహాత్మా బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని ఉదయం షఠస్థల ద్వజారోహణము, మహాత్మా బసవేశ్వరుడి చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించినట్లు అధ్యక్షులు చీలమల్లన్న అన్నారు. ఈనాటి బసవ జయంతి వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్,THIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి,CDC చైర్మన్ గడిల రామ్ రెడ్డి, మండల అధ్యక్షులు చాట్ల సిద్ధన్న సామూహిక ప్రార్ధన కార్యక్రమం మరియు బసవచౌక్ వద్ద పుష్ర్చన కార్యక్రమంలో పాల్గొన్నట్లు అధ్యక్షులు చీల మల్లన్న తెలియజేశారు.
అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పిల్లోడు విశ్వనాథం మాట్లాడుతూ మహాత్మ బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని నూతనంగా ఎన్నికైనటువంటి సదాశివపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ-సత్యనారాయణ దంపతులను అదేవిధంగా వైస్ చైర్ పర్సన్ రేణుక – చిరంజీవి దంపతులను మరియు ఉల్లిగడ్డ నాగరాజు గార్లను ఆహ్వానించి సమాజం పక్షాన సన్మానం నిర్వహించినట్లు తెలియజేశారు.
తదుపరి మఠం నుండి సభ్యులందరూ కూడా బసవచౌక్ వద్దకు చేరుకొని అశ్వార్డు వద్ద షటస్థల ధ్వజారోహణము గావించి తదుపరి మాహత్మ బసవేశ్వర విగ్రహానికి పుష్పార్చన నిర్వహించినట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి పులు మామిడి విరేశం,గౌరవ అధ్యక్షులు బోడగామ శ్రీశైలం, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, గంతల బసవరాజ్, దూది రామిశెట్టి, చందు స్వామి, రాచన్న స్వామి, ఈశ్వర్, నాగభూషణం, సంగమేశ్వర్ చీల రాజు,మహిళా భక్తులు మరియు సమాజ సభ్యులు పాల్గొన్నారు.









