సదాశివపేటలో ఘనంగా బసవేశ్వర జయంతి: నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి రాజు

సదాశివపేట పట్టణంలో ఘనంగా నిర్వహించిన 893వ మహాత్మ శ్రీ బసవేశ్వర మహారాజ్ జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులి మామిడి రాజు పాల్గొని పూలమాలను వేసి ఘన నివాళులను అర్పించడం జరిగింది.

మహాత్మ బసవేశ్వరుడు 12వ శతాబ్దానికి చెందిన వాడని ఫులిమామిడి రాజు అన్నారు. ఆయన చేసిన ప్రవచనాలు భక్తి పారదర్శకమైనవని, బసవేశ్వరుని సందేశఏమిటంటే సమానత్వం, న్యాయం, సేవా భావం, కష్టపడి పనిచేయడం వంటివి బసవేశ్వరుడు ఇచ్చిన ముఖ్యమైన సందేశాలు అని పులిమామిడి రాజు తెలిపారు. బసవేశ్వరుడు ఒక గొప్ప వ్యక్తి అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం నాయకులు ఉల్లిగడ్డల శివకుమార్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోడగామ నాగభూషణం, తాలెల్మ రాము, పిల్లోడి చంద్రశేఖర్, మారుతి, శ్రవణ్, శ్రీశైలం, శివ, పిఎంఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, అఖిల్, సోమ శంకర్, గుణాకర్, సురేష్ మొదలగువారు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు