బసవేశ్వర మందిరం లోశ్రీ మహాత్మ గురు బసవేశ్వరా 893వ జయంతి ఉత్సవాలు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీ విశ్వ గురు మహాత్మ బసవేశ్వరా 893వ జయంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే చింతల ప్రభాకర్ మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, అధ్యక్షులు గందిగ రాజు, పెద్ద మఠం అప్ప గారు లింగం స్వామి, రాష్ట్ర నాయకులు శివ చందర్ కుమారు పాటిల్,శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీ మహాత్మ గురు బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో వెలుగొందిన మహానుభావుడు, గొప్ప సామాజిక సంస్కర్త మరియు తత్వవేత్త. ఆయన సమ సమానత్వానికి ప్రతీకగా నిలిచి, కులవ్యవస్థ అంటరానితనం అనే అంధకారాన్ని తొలగించడానికి ధైర్యంగా పోరాడారు.కాయకమే కైలాసం అనే మహాసూత్రంతో శ్రమకు గౌరవం ఇచ్చిప్రతి మనిషి సమానుడనే భావనను సమాజంలో నాటారు.
అనుభవ మంటపం ద్వారా జ్ఞానం ధర్మం న్యాయం ప్రసారం చేసి సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారు. మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ మాట్లాడుతూ ఆ కాలం లోనే మహిళలకు సమానత్వం వర్తింప చేసి అయన నిర్మించిన పార్లమెంట్ లొ మహిళలకు ప్రథమ స్థానం కలిపించిన గొప్ప మహానుభావులు. అధ్యక్షులు గాంధిగా రాజు మాట్లాడుతూ
ఆయన బోధనలు ఈ రోజుకీ కోట్ల మందికి స్ఫూర్తిగా నిలుస్తూ సమానత్వం మరియు మానవత్వానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచాయి అనారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు నాయకులు యువకులు వీరశైవ సమాజం ఘనంగా వేడుకలు నిర్వహించారు,ఈ కార్యక్రమంలో కార్యనిర్వహక అధ్యక్షులు అన్మిశెట్టి జయప్రకాశ్, ప్రధాన కార్యదర్శి సిద్దికేర్ వినోద్, కోశాధికారి అమరాధి రాచన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీర మహేందర్ అడ్వకేట్, సమాజ సభ్యులు రాచప్ప, రమేష్, రవి, సురేష్ , శేఖర్, శేఖర్, సతీష్, రవణప్ప, షాబాద్ వీరన్న, విశ్వనాథ్,ప్రవీణ్,లోకేష్,మల్లేశం,వీరు,వైద్యనాథ్,నర్సింల,నాగు, మరియ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు