- సంగారెడ్డిలో ఘనంగా బసవేశ్వర జయంతి
- మహాత్మా బసవేశ్వరుడికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డిలోని బసవేశ్వర విగ్రహాలకు పూల మాలలు సమర్పించారు.మొదట సంగారెడ్డి పట్టణంలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ఉన్న విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు., ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.•తరువాత బైపాస్ రోడ్డులోని బసవేశ్వర విగ్రహానికి ఆమె పూలమాలలు సమర్పించారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాయకమే కైలాసం అని మహాత్మా బసవేశ్వరుడు శ్రమ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడన్నారు. సామాజిక సంస్కరణ కోసం, సామాజిక అసమానతలు, కుల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్తగా బసవేశ్వరుడి పాత్రను నిర్మల జగ్గారెడ్డి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, నాయకుడు కూన సంతోష్, కౌన్సిలర్లు వంశీ, హరిష్ తదితరులు పాల్గొన్నారు.









