TG 5, సంగారెడ్డి ప్రతినిధి
ఈ పర్యటనలో విశ్వగురు, మహాత్మ బసవేశ్వర 893 వ జయంతి సందర్భంగా వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో జోగిపేట చౌరస్తాలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. మహాత్మ బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త, దార్శనికుడు, కవి, రాజనీతిజ్ఞుడుగా అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. వారి బోధనలు, ఆశయాలు ఆచరణీయమన్నారు. “పనే ప్రత్యక్ష దైవం” (Work is Worship) అని వారు బోధించారన్నారు. ప్రతి వ్యక్తి తన కష్టార్జితం తో జీవించాలని, శ్రమకు గౌరవం ఇవ్వాలని వారు చాటి చెప్పారని ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, లింగాయత్ సమాజం జోగిపేట ముఖ్య నాయకులు, సామాజికవేత్తలు, పాల్గొన్నారు.









