TG 5, సంగారెడ్డి ప్రతినిధి
- డీ లిమిటేషన్ తో కలిపి మహిళా బిల్లును ప్రవేశపెట్టడంలోనే బీజేపీ చేస్తున్న కుట్ర దాగి వుంది
- కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి మహిళల సాధికారతకు కట్టుబడి వుంది
- వచ్చే సమావేశంలో మహిళా బిల్లును సెపరేట్ గా ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం
- సంగారెడ్డిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
- నిర్మలా జగ్గారెడ్డి కామెంట్స్
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం అని బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది
- గతంలోనే మహిళా బిల్లు ఆమోదం పొందేలా చేసింది కాంగ్రెస్ పార్టీ
- కేవలం బీజేపీ వాళ్లు దీనిని ఒక ఆయుధంగా మార్చుకోవాలని కుట్ర చేశారు
- ఆడజాలక పాత గజ్జెలు అన్నట్లుగా ఉంది బిజెపి నాయకుల ధోరణి
- డీలిమిటేషన్ లో మహిళా బిల్లును కలపడమే ఇందుకు నిదర్శనం
- బీజేపీలో ఒక్కరినైనా ప్రధాని స్థాయికి తెచ్చారా? కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ ప్రధాని పదవిని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ వస్తోంది
- మీకు దమ్ము, దైర్యం ఉంటే పార్లమెంట్ లో మహిళా బిల్లును సెపరేట్ గా ప్రవేశ పెట్టండి.. కాంగ్రెస్ తప్పకుండా మద్దతునిస్తుంది
- అందుకు విరుద్ధంగా కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. డీ లిమిటేషన్, మహిళా బిల్లులను వాడుకుంటోంది
- కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి మహిళలకు సరైన ప్రాధాన్యత ఇస్తోంది.
- దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యం తగ్గించేలా, ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేయడానికి…బీజేపీ డి లిమిటేషన్ బిల్లు పేరిట కేవలం ఓట్ల రాజకీయం చేస్తోంది.
- పైగా మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అంటూ బురద జల్లే ప్రయత్నం చేస్తోంది.
- తెలంగాణలో మహిళలను కోటీశ్వరులను చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన సాగుతోంది
- వచ్చే సమావేశాల్లో మహిళా బిల్లును సెపరేట్ గా ప్రవేశ పెట్టాలి. లేని పక్షంలో మహిళల హక్కులను సాధించుకునేలా పోరాటం చేస్తాం
- ఈ విలేకరుల సమావేశంలో సదాశివ పేట మున్సిపల్ ఛైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ, సంగారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ కూన వనిత, సదాశివపేట వైస్ ఛైర్ పర్సన్ రేణుక చిరు, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిపల్లి సత్యనారాయణ, కూన సంతోష్, కిరణ్ గౌడ్, చిరు, సిద్దన్న, మోతీ లాల్ నాయక్, బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు
Post Views: 13









