మెలిగిరిపేట గ్రామంలో ఘనంగా పోషణ్ పక్వాడ కార్యక్రమం…

TG5, సంగారెడ్డి ప్రతినిధి
. కార్యక్రమానికి హాజరైన డి డబ్ల్యు ఓ శ్రీమతి లలిత కుమారి… పిల్లలలో శారీరక మానసిక అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైనదని బి డబ్ల్యు ఓ అధికారి శ్రీమతి లలిత కుమారి అన్నారు. సదాశివపేట మండలం మెలిగిటి పేట గ్రామంలో నిర్వహించిన పోషణ్ పక్వాడ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైనారు. గ్రామ సర్పంచ్ షాబుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించినఈ కార్యక్రమంలో శ్రీమతి లలితా కుమారి, సిడిపిఓ చంద్రకళ మాట్లాడుతూ పిల్లల యొక్క మెదడు అభివృద్ధికి వారు తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తలు వహించాలని అన్నారు. పిల్లలు ఆరోగ్యవంతులుగా పెరుగుతుంటేనే వారి శరీరక వృద్ధి కూడా పెరుగుతుందని దానికి తగిన జాగ్రత్తలు అవసరమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలని అన్నారు. పుట్టిన నుండి ఆరు సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి మానసిక అభివృద్ధి పెంపొందించడానికి పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడీ టీచర్లకు సహకరించాలని పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యము అన్న సామెతను నిజం చేయాలని వారు అన్నారు. పిల్లలకు బయటి పదార్థాలను తినకుండా ఉండేటట్లు చూసే బాధ్యత తల్లిదండ్రులని అదేవిధంగా వారికి చిరుధాన్యాల ద్వారా పండిన పంటలను ఆకుకూరల వంటకాలను పండ్లను తినేటట్టు చూడాలని అన్నారు. పిల్లల ఆరోగ్యం పెరుగుదల విషయంలో ప్రభుత్వం ద్వారా అందించే పోషకాలతో కూడిన పదార్థాలను తీసుకోవాలని మీకు ఏమైనా సందేహాలు ఉంటే అంగన్వాడి టీచర్ను సంప్రదించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ కోఆర్డినేటర్ సౌమ్య ఉమెన్ ఎంపవర్మెంట్ జిల్లా కోఆర్డినేటర్ పల్లవి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈనెల 23వ తేదీ వరకు ఆయా గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో జరుగుతుందని పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మిలిగిరి పేట గ్రామ పాఠశాల హెడ్మాస్టర్ అంగన్వాడీ సూపర్వైజర్లు పోషణ్ అభయాన్ కోఆర్డినేటర్ లక్ష్మణ్ గ్రామ ఉపసర్పంచ్ యాదయ్య వార్డు మెంబర్లు అంగన్వాడీ టీచర్ ఇందిరమ్మ మీనా మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాములు చిన్న పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు