TG5, సంగారెడ్డి ప్రతినిధి
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఏడు గంటలకు స్వామివారికి రుద్రాభిషేకం చేయబడునని అలాగే ఎనిమిది గంటల 30 నిమిషాలకు ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. అనంతరం మహాత్మా బసవేశ్వరుడిని స్మరిస్తూ భక్తులు, లింగాయత్ వీరశైవ సమాజం సభ్యులు అందరూ కలిసి సామూహికంగా ప్రార్థన చేస్తామని సమాజ ప్రధాన కార్యదర్శి సింధోల్ వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బసవ జయంతి ఉత్సవాలను ప్రతి గ్రామ, మండల, జిల్లా కేంద్రాలలో అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా గౌరవ సలహాదారు మాజీ ప్రధాన కార్యదర్శి అనిమిశెట్టి జయప్రకాష్ తెలిపారు ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ 12వ శతాబ్దపు మహానుభావుడు అయిన బసవేశ్వరుడు గొప్ప సామాజిక సంస్కర్త,,తత్వవేత్త అని ఆయన సమ- సమానత్వానికి ప్రత్యేకతగా నిలిచిన మహానుభావుడని జయ ప్రకాష్ అన్నారు. కుల వ్యవస్థ అంటరానితనం అనె అంధకారాన్ని రూపుమాపడానికి ధైర్యంగా పోరాడిన వ్యక్తి బసవేశ్వరుడు అని ప్రతి వ్యక్తి శ్రమకు గౌరవం ఇచ్చి అందరూ సమానులు అనే భావనను సమాజంలో కి తీసుకువెళ్లిన గొప్ప సంస్కర్త అని అన్నారు. ఈ ఉత్సవాలను దేశంలోని అనేక రాష్ట్రాలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అలాగే సదాశివపేటలో కూడా లింగాయత్ సమాజం వారు నిర్వహించే బసవ జయంతి ఉత్సవ కార్యక్రమాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపను పొందగలరని ఎడ్లబజార్ వీరశైవ సమాజం సభ్యులు తరపున కోరుతున్నట్లు కార్యవర్గం తెలిపింది. ఈ ఉత్సవాలలో భాగంగా సాయంత్రం 6 గంటలకు మహాత్మ బసవేశ్వర శోభాయాత్ర సదాశివపేట నుండి పురవీధుల గుండా అంగరంగ వైభవంగా జరుగుతుందని అలాగే రాత్రి 9 గంటలకు డోలారోహణ కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని ప్రధాన కార్యదర్శి సిందోలు వినోద్ కుమార్ తెలిపారు.









