తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు యువ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఏప్రిల్ 18, 2026న జీఓ నంబర్ 491 విడుదల చేశారు. మొత్తం తొమ్మిది మంది 2022, 2023 బ్యాచ్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించిన ఈ బదిలీల్లో ప్రధానంగా వరంగల్ ఏఎస్పీగా ఉన్న నగరాలె శుభమ్ ప్రకాష్‌ను నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్)గా పంపించడంతో ప్రస్తుతం వరంగల్ ఏసీపీ (ఏఎస్పీ) పోస్టుకు ఖాళీ ఏర్పడి కొత్త పోస్టింగ్ కోసం ఎదురుచూస్తోంది. అదేవిధంగా వరంగల్ (జనగాం) ఏఎస్పీ పాంధరే చేతన్ నితిన్‌ను జగిత్యాల అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. వీరితో పాటు ఆసిఫాబాద్ ఏఎస్పీ ఎస్.చిత్తరంజన్‌ను అక్కడే అదనపు ఎస్పీగా, కామారెడ్డి ఏఎస్పీ బొక్క చైతన్య రెడ్డిని సంగారెడ్డి అదనపు ఎస్పీగా, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్‌ను మెదక్ అదనపు ఎస్పీగా, భైంసా ఏఎస్పీ రాజేష్ మీనాను వనపర్తికి, ఆదిలాబాద్ ఏఎస్పీ పి.మౌనికను అక్కడే అదనపు ఎస్పీగా నియమించారు. నిర్మల్ ఏఎస్పీ పతిపాక సాయికిరణ్‌ను భైంసా ఏఎస్పీగా, వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టెను ఉట్నూరు ఏఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది









