ఫైర్ ఆఫీసర్ బిక్షపతి.
TG 5, సంగారెడ్డి ప్రతినిధి
అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శనివారం నాడు అగ్నిమాపక ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బిక్షపతి ఆధ్వర్యంలో
సదాశివపేటలోని HP గ్యాస్ ఆఫీస్, మరియు గోదాములో అగ్ని ప్రమాదాలపై అవగాహన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ బిక్షపతి మాట్లాడుతూ ఆఫీసులో CO2 (కార్బన్ డయాక్సైడ్) మరియు abc (డ్రై కెమికల్ పౌడర్) మంటలు ఆర్పడానికి ఈ పరికరాలు తప్పనిసరిగా ఉండాలని గ్యాస్ ఆఫీస్ యాజమాన్యానికి వివరించడం జరిగింది.
అంతేగాక గ్యాస్ సిబ్బందికి గ్యాస్ కస్టమర్లకు కూడా ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ కస్టమర్లకు తెలియజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, రవికుమార్, శ్రీశైలం, సాయికుమార్, నవీన్ కుమార్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 5









