సదాశివపేట పట్టణం లోని హజరత్ మహబూబ్ పాశ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి

T G 5,సంగారెడ్డి ప్రతినిధి

సదాశివపేట పట్టణం లోని హజరత్ మహబూబ్ పాశ దర్గా లో జరిగిన ఉర్సు ఉత్సవాల్లో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. గత మూడు రోజులు గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ దర్గా లో హజరత్ సయ్యద్ షా మహమ్మద్ సాహబ్ 422 వ ఉర్సే షరీఫ్ మరియు హజరత్ మహబూబ్ పాశ 52 వ ఉర్సే షరీఫ్ ఉత్సవాలు సంయుక్తంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా జరిగిన కవ్వాలి కార్యక్రమం ఆహుతులను అలరించింది. కవ్వాలి కార్యక్రమం నిర్వాహకులను, దర్గా కమిటీ సభ్యులను జగ్గారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని, కవ్వాలి కార్యక్రమం బాగుందని నిర్వాహకులను అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు