ARRIVE ALIVE క్యాంపెయిన్ – 4వ దశ, 6వ రోజు

ARRIVE ALIVE క్యాంపెయిన్ 4వ దశలో భాగంగా, 6వ రోజు షెడ్యూల్ ప్రకారం నేను, ఎస్సై సాంబయ్య గారు మరియు మా సిబ్బంది కలిసి KMC క్రాస్ రోడ్ పరిధిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించాము.

హెల్మెట్ ధరించని రెండు చక్ర వాహనదారులపై ప్రత్యేకంగా దృష్టి సారించి, హెల్మెట్ ప్రాముఖ్యతపై వారికి కౌన్సెలింగ్ ఇచ్చాము. అవగాహనను మరింత ఆకర్షణీయంగా చేయడానికి వారికి “విశిష్ట శిరస్త్రాణధారుడు”, “రోడ్ రోమియో”, “అసుర శిరస్కుడు” వంటి బిరుదులు అందించాము. అలాగే ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇంటికి చేరాలని వారితో ప్రమాణం చేయించాము.

అదనంగా, లోటస్ స్కూల్ బస్సులను తనిఖీ చేసి అవసరమైన పత్రాలను పరిశీలించాము మరియు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో నిర్ధారించాము. మైనర్ డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి, అప్రాయ వయస్సులో డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాల గురించి అవగాహన కల్పించాము. #RoadSafety #ArriveAlive

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు