నారాయణ ఖేడ్ ఏప్రిల్ 18( tg5న్యూస్ )( జర్నలిస్ట్ షైక్ ఫయాజ్ )
నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహా రక్తదాన శిబిరానికి’ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి వెంకట్ రెడ్డి, పోలీస్ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే స్వయంగా పాల్గొన్నారు.
యువత ముందుకు రావాలి:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తక్కువగా ఉన్నాయని, అత్యవసర సమయాల్లో రోగులకు రక్తం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, తద్వారా బ్లడ్ బ్యాంకులకు సహకరించాలని పిలుపునిచ్చారు.
‘అరైవ్-అలైవ్’పై అవగాహన:
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అరైవ్ – అలైవ్’ (అర్రివే – అలీవ్ ) ప్రోగ్రాంపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. వాహనదారులు విధిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, అతివేగం మరియు అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాల వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, వైద్య సిబ్బంది మరియు భారీ సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు.









