ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆత్మ డైరెక్టర్ Deva Reddy ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. భక్తులకు సేవ చేయడం అత్యంత పుణ్యకార్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ గారు దేవరెడ్డి గారిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.
Post Views: 17









