తెలంగాణ రాష్ట్ర కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా సూర్యాపేట సబ్ జైలును సందర్శించి సమగ్రంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె జైలు నిర్వహణలోని ముఖ్య అంశాలు అయిన ఆహార నాణ్యత, భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రత, ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు. ఖైదీలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సంక్షేమం గురించి తెలుసుకొని, జైలులో అందుతున్న సదుపాయాలపై వారి అభిప్రాయాలను సేకరించారు.
ఖైదీలకు సరైన సంరక్షణ, భద్రత సంక్షేమాన్ని కల్పించడం అత్యంత ముఖ్యమని, అలాగే వారి పునరావాసం మార్పు కోసం సమర్థవంతమైన సంస్కరణ చర్యలను అమలు చేయాలని డా. సౌమ్య మిశ్రా పేర్కొన్నారు.ఈ తనిఖీలో హైదరాబాద్ రేంజ్ డి ఐ జి ప్రిజన్స్డా. డి. శ్రీనివాస్ , ఆర్. శోభన్ బాబు, బి. సుధాకర్ పాల్గొన్నారు.
Post Views: 12









